మంత్రి ఆనం ను కలిసిన కావలి ఎమ్మెల్యే
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం నెల్లూరు లోని మంత్రి గారి కార్యాలయంలో కలిశారు. కొండబిట్రగుంట, ఇతర దేవస్థానాల్లో చేపట్టవలసిన పలు కార్యక్రమాలను ఆయన మంత్రికి వివరించారు. కావలి నియోజకవర్గం లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు. మంత్రి గారు సానుకూలంగా స్పందించారు..